భార్యను కడతేర్చిన భర్త…

by Sumithra |
Murder
X

దిశ, నిజామాబాద్ రూరల్: అనవసరమైన కుటుంబ కలహాలతో నిండునూరేళ్ల జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు కొందరు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని వారి జీవితాలను అందకారంలో పడేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. దర్పల్లి సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన చిత్తారి మహేష్, నర్సమ్మలు భార్యభర్తలు. కుటుంబ కలహాలతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ కాగా భార్య సొంత ఊరైన మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లిపోయింది.

దీంతో భర్త చిత్తారి మహేష్ భార్య నర్సమ్మను సముదాయించి తిరిగి మెట్‌పల్లి గ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో దర్పల్లి మండలంలోని తమ కూతురు వద్ద ఒకరోజు ఉండిపోదామని వచ్చారు. సోమవారం ఉదయం కూతురు ఇంటి వద్ద మళ్లీ భార్యభర్తలకు గొడవల కావడంతో ఆగ్రహానికి లోనైన చిత్తూరి మహేష్ తన భార్య నర్సమ్మ (37) తలపై సుత్తితో గట్టిగా మోది హత్య చేశాడు. అదిచూసి భయభ్రాంతులకు గురైన కుటుంబీకులు కేకలు వేయడంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి సిఐ శ్రీశైలం చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు చిత్తారి మహేష్ పరారీలో ఉన్నట్లు సీఐ శ్రీశైలం పేర్కొన్నారు.

Advertisement

Next Story