అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..

by Sumithra |
అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ఇందల్వాయి మండలం దేవి తండా గ్రామం సేవాలాల్ ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ప్రమాదవ శాత్తు బైక్ అదుపుతప్పడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాల పాలై వైద్యం తీసుకుంటున్నట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

వివరాల్లోకివెళితే.. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన లావణ్య (25) భర్త బాలకృష్ణతో కలిసి కామారెడ్డి జిల్లాలోని బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తోంది.ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. భార్య లావణ్యను బాలకృష్ణుడు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే లావణ్య మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story