- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.38 వేలకే కేజీ బంగారం.. భార్యకు గిఫ్ట్ ఇచ్చిన భర్త
దిశ, వెబ్‌డెస్క్ : భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త నానాతంటాలు పడడం సహజం. కానీ ఓ భర్త.. తన భార్య జీవితాంతం గుర్తిండిపోయేలా ఓ వింత పని చేశాడు. అతడు చేసిన పని భార్యే కాదు.. అది తెలిసిన మరెవ్వరు దానిని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదు. పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేశాడీ ఘనుడు. ఇంతకూ ఏం చేశాడంటే..
మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి పెళ్లిరోజున తన భార్యను సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆమెకు బంగారం అంటే ఇష్టమని గ్రహించే అదే కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువగా జ్యూవెలరీకి వెళ్లి కేజీ బంగారంతో పుస్తెతో కూడి పుస్తెల తాడును చేయించి భార్య మెడలో వేశాడు. పెళ్లి రోజున తనకు అంత బంగారం రావడంతో భార్య సంతోషంతో ఆ పుస్తెల తాడును వేసుకుని భర్తతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. కేజీ బంగారం కావడంతో ఆమె మోకాళ్ల వరకు భారీ సైజ్ లో కనిపించింది ఆ నగ. అయితే ఆ బంగారంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేజీ బంగారం పుస్తెల తాడు విషయం పోలీసులకు తెలియడంతో వారు ఎంక్వేరీ చేశారు. బాలాను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన చెప్పిన సమాధానం విని స్టేషన్‌లోని పోలీసులంతా అదిరిపడ్డారు. మరోసారి ఇలాంటి పబ్లిసిటీ డ్రామాలు ఆడొద్దని హెచ్చరించి పంపించారు. ఇంతకు బాలా ఏం సమాధానం చెప్పాడంటే.. తాను కేజీ బంగారంతో మంగళసూత్రం చేయించలేదని, అది మార్వాడి షాప్‌లో రూ.38 వేలు పెట్టి కొనుగోలు చేసిన రోల్డ్ గోల్డ్ నగ అని చెప్పి షాక్ ఇచ్చాడు. వారి దర్యాప్తులోనూ అదే తేలింది. ఈ విషయం తెలిసిన పోలీసులే అంతగా షాక్ అయితే భార్యకు తెలిస్తే భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మరి..!!