- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌పై పాక్ గెలుపుతో భార్య ఖుషీ.. భర్త చేసిన పనికి షాక్‌లో ఫ్యామిలీ
దిశ, వెబ్‌డెస్క్ : భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎమోషన్ ఫీలింగ్స్ బయటకు వస్తాయి. ఎలా అయినా భారత్ గెలవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఈ విషయాన్ని టీమ్ఇండియా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. అక్టోబర్ 24న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్మ్యాచ్లో భారత్‌పై పాక్ విజయం సాధించింది. ఆ సమయంలో ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్చూసిన ఇషాన్మియాన్మ్యాచ్ ఓడిపోవడంతో ఆవేదన చెందాడు. అదే సమయంలో తన వాట్సాప్చూడగా.. అందులో పాక్గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య స్టేటస్కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇషాన్ మియాన్.. రామ్పూర్ఎస్పీని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భారత్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించాడు. రబియా స్టేటస్ ఆధారంగా పోలీసులు సెక్షన్ 153ఏ, 66 కింద కేసు నమోదు చేశారు.