- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య రెండు చేతులు నరికి.. కరోనానే కారణమన్న భర్త
దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. బంధాలను, బంధుత్వాలను విచ్చినం చేస్తోంది. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తల్లీబిడ్డలను కూడా వేరుచేసి విలయతాండవం సృష్టిస్తుంది. కరోనా కారణంగా ఎంతోమంది తమ అనుకున్నవాళ్లను పోగొట్టుకున్నారు. మరెంతోమంది తమ అనుకున్నవారినే రోడ్ల మీద వదిలిస్తున్నారు. ఇంకొంతమంది కరోనా భయంతో ఆత్మహత్యచేసుకున్నారు.. కానీ ఒక భర్త తన భార్యకు కరోనా వచ్చిందని అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం..కావలికి చెందిన ఓ వ్యక్తి భార్యకి ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీంతో భర్త ఆందోళన చెందాడు. భార్యవలన తనకు కరోనా సోకుతుందేమో అని భయపడి.. ఆమెను కిరాతకంగా హత్యచేశాడు. భార్య రెండు చేతులు నరికి, హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.