బయ్యారంలో తీవ్ర విషాదం.. విద్యుత్‌ షాక్‌తో భార్యభర్తలు మృతి

by Shyam |
electric shock
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలోని సింగారం-2 కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో భార్యభర్తలు ఉపేందర్(32), తిరుపమ్మ(28) మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం తిరుపమ్మ స్నానం ముగించుకొని దండెంమీద టవల్ ఆరవేస్తుండగా పక్కనే విద్యుత్ తీగ దండెం(ఇనుప తీగ)కు తాకడంతో తిరుపమ్మ కరెంట్ షాక్‌కు గురైంది, గమనించిన భర్త ఉపేందర్ ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా ఆయనకూ కరెంట్‌ షాక్‌ తగిలి కుప్పకూలారు. వీరిని గమనించిన బంధువులు ఇద్దరినీ వైద్యం కోసం ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు వదిలారు. వీరికి ఇద్దరు శ్యామల(8), బింధు(6) ఆడపిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story