భర్తను చంపింది.. సేవ చేసిన భార్యను కూడా వదలని కరోనా..!

by Sumithra |   ( Updated:2021-04-29 05:11:54.0  )
భర్తను చంపింది.. సేవ చేసిన భార్యను కూడా వదలని కరోనా..!
X

దిశ, వనపర్తి : భర్తకు కరోనా సోకిందని సేవలు చేసిన భార్య కూడా వైరస్ బారీన పడింది. దీంతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. శ్రీరంగపురం మండలానికి చెందిన సాయి ప్రకాష్ ఓ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య(లెక్చరర్), ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సెకండ్ వేవ్ ఉధృతిలో సాయి కృష్ణకు కూడా కరోనా సోకింది. దీంతో హోంఐసోలేషన్‌లోనే ఉంటూ.. చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే సమయంలో అతడి భార్య ఉమ అటెండర్‌గా సేవలు అందించింది. ఈ క్రమంలోనే ఆమెకు కూడా కరోనా సోకింది. ఇక లాభం లేదు అని హైదరాబాద్‌లోని ఆయుష్ హాస్పిటల్‌గా చేరారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సోమవారం సాయి ప్రకాష్ చనిపోయాడు. ఆ తర్వాత ఉమ ఆరోగ్యం కూడా క్షీణించి బుధవారం రాత్రి కన్నుమూసింది. మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మిగిలారు.

Advertisement

Next Story