- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెయ్యేళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం
X
దిశ, వెబ్‌డెస్క్: వేయి ఏళ్ల క్రితం నాటి వందల కొద్ది బంగారు నాణేలు ఇజ్రాయిల్‌లో లభ్యమయ్యాయి. తవ్వకాలు జరుపుతుండగా.. కొందరు యువ వాలంటీర్లు నిధిని ఈ నెల 18న కనుగొన్నట్లు ఇజ్రాయిల్ పురాతన సంపద అథారిటీ వెల్లడించింది. అప్పటి కాలంలో ఈ బంగారు నాణేలను భూమిలో దాచి తిరిగి తీసుకు వెళ్లాలని భావించిన వీటి యజమాని ఎవరో అంతు చిక్కని విషయమని ఇజ్రాయెల్ అధికారి లియత్ నదవ్‌జివ్ వెల్లడించారు.
పురావస్తు తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతుండగా బంగారు నాణేలు బయట పడ్డాయని, ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయని వాంటీర్ ఒజ్ కొహెన్ అన్నారు. ఈ నాణేలు 9 శతాబ్ధానికి చెందిన అబ్బాసిద్ కాలిఫేట్ హయాంకు చెందినవని పురాతన సంపద అథారిటీ నిపుణుడు రాబర్ట్ కూల్ అంచనా వేస్తున్నారు. ఈ నిధితో అప్పటి కాలంలో విలాసవంతమైన భవనం కొనుగోలు చేయవచ్చని కూల్ అన్నారు.
Advertisement
Next Story