హరితహారం అంటూనే అడ్డంగా నరుకుతున్నారు

by Shyam |
హరితహారం అంటూనే అడ్డంగా నరుకుతున్నారు
X

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తూ మరో పక్క పచ్చని చెట్లను కూల్చి వేస్తుంది. పర్యావరణ పరిరక్షణకు అవరోధంగా ప్రభుత్వమే ఈ విధంగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా వైకుంఠ ద్వారం మొదలుకొని దేవస్థానం తులసి కాటేజీ వరకు దాదాపుగా పది రావి చెట్లు, మర్రి చెట్లు, వేప చెట్లు ఎంతోమందికి నీడనిస్తున్నాయి. దీనికితోడు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వృక్షాలుగా పేరుగాంచాయి. అటువంటివాటిని రోడ్డు విస్తరణ అనే సాకుతో తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పచ్చదనం అంటూనే.. మరోపక్క ఎదిగిన వృక్షాలను సమూలంగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed