కుక్కకు లిఫ్ట్.. అర్థరైటిస్‌కు చెక్

by Shyam |
కుక్కకు లిఫ్ట్.. అర్థరైటిస్‌కు చెక్
X

ఒకప్పుడు వృద్ధులు మాత్రమే కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతుండేవారు. కానీ ప్రస్తుత కాలంలో.. రకరకాల ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్యలు వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మనుషులకు కీళ్ల నొప్పులు రావడం కామన్ అయిపోయింది. కానీ కుక్కలకు కూడా ‘అర్థరైటిస్’ రావడమే కాస్త విచిత్రంగా ఉంది. ఇదే విచిత్నం అనుకుంటే, దాని యజమాని.. ఆ కుక్క కోసం ఏకంగా ఓ బస్ స్లైడ్‌ను నిర్మించాడు. ఏంటా బస్ స్లైడ్? ఎందుకు నిర్మించాడో ? తెలుసుకోండి.

ఓ యజమాని.. లియో అనే ఇంగ్లీష్ బుల్ డాగ్‌ను పెంచుకుంటున్నాడు. దానికి అర్థరైటిస్ రావడంతో.. కాస్త కష్టంగా నడుస్తూ, మెట్లు కూడా ఎక్కలేక ఇబ్బంది పడింది. దీన్ని గమనించిన యజమాని.. ఆ కుక్కను డాక్టర్‌కు దగ్గరికి తీసుకెళ్లి, ఎంత ఖర్చయినా పరవాలేదు.. ట్రీట్‌మెంట్ చేయమని సూచించాడట. కానీ డాక్టర్ ఏం చేయలేకపోయాడంట. దీంతో తన లియో కోసం ఏదైనా చేయాలని ఆ యజమాని భావించాడు. ఇంట్లో లిప్ట్ పెట్టించ‌డానికి వీల్లేకపోవడంతో.. మెట్లు ఎక్క‌డానికి, దిగ‌డానికి ఈజీగా ఉండేలా ఓ ‘‘డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ స్లైడ్‌’’ను తయారుచేయించాడు. లండన్ డబుల్ డెక్కర్ బస్‌‌కు రెప్లికాగా లియో బస్ రూపొందించడం విశేషం. ఈ వీడియోను అమెరిక‌న్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేయడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed