ప్రతి కౌగిలింతకో అర్థం ఉందని తెలుసా..?

by sudharani |
ప్రతి కౌగిలింతకో అర్థం ఉందని తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కౌగిలింత. ఈ పేరు వింటేనే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్గుపడుతుంటారు. పట్టణ ప్రాంతాల్లోనూ కౌగిలింతలు తక్కువే. ఉన్నత వర్గాల ఫ్యామిలీల్లో ఈ కౌగిలింతలు సినిమాలను తలపించేలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. అయితే రోజు కౌగిలించుకుంటే ఆరోగ్యానికి మంచిదని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ కౌగిలింతల్లో కూడా రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఏ కౌగిలింతకు ఏ అర్థం వస్తుందో తెలుసుకుందాం..!

భావోద్వేగాలకు రూపం కౌగిలింత. ఒక్క హగ్‌తో ప్రేమను పంచవచ్చు. బాధను వ్యక్త పర్చవచ్చు. అనుభూతిని తెలపవచ్చు. రెండు హృదయాలను ఏకం చేయవచ్చు. సందర్భానికి తగ్గట్టు కౌగిలింతకు అర్థం మారుతుంది. భార్యను హగ్ చేసుకుంటే.. దానిని వారు సురక్షితమైందిగా భావిస్తారు. స్నేహితులను కౌగిలించుకుంటే దానిని బియర్ హగ్ అంటారు. దీని వల్ల వారిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఏర్పడుతుంది.

సినిమాల్లో ఎక్కువగా హీరోహీరోయిన్లు చేసుకునేది ప్రేమ కౌగిలి. దీని వల్ల బంధం బలపడడంతోపాటు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆలింగనం చేసుకోని భుజంపై తల వాల్చితే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చిన వారిని ఎక్కువసేపు కౌగిలించుకుంటాం. ఆ ఆలింగనంలో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి.

జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఇచ్చే హగ్.. రొమాంటిక్ హగ్. ఈ కౌగిలింతతో ఇద్దరు ఒకరి మనసులోని స్పందనలు, శ్వాసను మరొకరు ఆస్వాదిస్తారు. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది. కిస్ చేస్తూ హగ్ చేయడం అంటే కలల ప్రపంచంలోకి వెళ్లడమే. ఇష్టమైన వారు చాలా రోజుల తర్వాత కలిస్తే అవధుల్లేని ఆలింగనం చేసుకుంటారు. దీనిలో ఎంతో ఆత్మీయత ఉంటుంది. ఇదండి కౌగిలింతల ముచ్చట.

Advertisement

Next Story

Most Viewed