- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండింటి మధ్యలో బెల్ట్ షాప్.. వారే టార్గెట్
దిశ, మహదేవపూర్: పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్ షాపుల నిర్వాహకులు, పైకి కిరణం షాపులు నడుపుతూ, జోరుగా బెల్టు దందా నిర్వహిస్తున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలుగు చూసింది. కాళేశ్వరం గ్రామం గోదావరి మెయిన్ రోడ్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సంగమేశ్వర ఆలయం, దత్తాత్రేయ ఆలయం ఎదురుగా, బస్టాండ్ సర్కిల్ నుంచి మహారాష్టకు వెళ్లే రోడ్డులో కన్నెపల్లి వరకు, వీఐపీ రోడ్డులో విచ్చలవిడిగా బెల్టు దందా నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమంలో అస్తికల నిమజ్జనానికి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ.. మద్యం ప్రియులకు ఎప్పుడూ మందు అందుబాటులో ఉంటుంది.
ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందగా మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ, అక్రమ మద్యానికి తెరలేపి అందినకాడికి దోచుకుంటూ, యాత్రికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో లిక్కర్, బీర్ పై 50 రూపాయలు అదనంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ యువత పొద్దున్నే లేస్తే చాలు గుడి ముందు భక్తులు బారులు తీరినట్టుగా ఇక్కడి వైన్ షాప్‌లకు మందుబాబులు బారులు తీరుతున్నారు.
యువత ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లో వారిని బెదిరిస్తూ, డబ్బులు వసూలు చేసుకుని నిత్యం బెల్టు షాపుల్లో మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు బానిసై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సాయంత్రం ఆరు అయిందంటే చాలు ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ మందుబాబులు హంగామా సృష్టిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని మద్యం సేవిస్తూ ఖాళీ సీసాలను గోదావరి మెట్లపై పగలగొట్టడం వల్ల, స్నానానికి వచ్చే భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులకు ముడుపులు అందడంతో తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.