ఎన్నికల ఎఫెక్ట్.. హుజురాబాద్‌లో భారీగా డబ్బు, గోల్డ్ సీజ్

by Sridhar Babu |
ఎన్నికల ఎఫెక్ట్.. హుజురాబాద్‌లో భారీగా డబ్బు, గోల్డ్ సీజ్
X

దిశ, కరీంనగర్ సిటీ : జిల్లాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1,57,18,727 ల అక్రమ నగదు పట్టుకొని అధికారులు సీజ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు, విజిలెన్స్ టీంలు, పోలీస్ బృందాలు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఓటర్లను ప్రభావితం చేసే అనేక రకాల ప్రలోభాలను అడ్డుకునేందుకు పకడ్బంధీ చర్యలు చేపట్టగా, ఇంతవరకు రూ.1,57,18,727 రూపాయల నగదు, రూ.1,50,000ల విలువ గల 30 గ్రాముల బంగారం, రూ.9,10,000ల విలువ గల 14 కిలోల వెండి, రూ.5,34,667ల విలువ గల 900 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే రూ.2,21,000ల విలువ గల 66 చీరలు, 50 షర్టులను స్వాధీనం చేసుకున్నారు. రూ.19,750ల విలువ గల 3.51 కిలోల గంజాయి పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed