హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారులకు భారీ జరిమానా

by Sumithra |
హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారులకు భారీ జరిమానా
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిబంధనలకు విరుద్ధంగా ఇథలిన్ రైఫినర్ వాడుతున్న పండ్ల వ్యాపారులకు జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల బృందం జరిమానా విధించింది. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు గురువారం కొత్తపేట ఫ్రూట్ మార్కెట్, జాంబాగ్, చార్మినార్‌లలోని ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులపై తనిఖీ నిర్వహించారు. ఫలాలను కృత్రిమంగా మాగపెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఇథలిన్ రైఫినర్ వాడుతున్న నలుగురు పండ్ల వ్యాపారులను గుర్తించారు. వెంటనే వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇథలిన్ రైఫినర్‌ను ప్రత్యేకంగా పేపర్‌లో ఉంచి వాడాల్సి ఉండగా, దీనికి విరుద్ధంగా నేరుగా పండ్లపైనే పెట్టడం నేరమన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story