శివమొగ్గలో భారీ పేలుడు.. 8మంది దుర్మరణం

by Shamantha N |
శివమొగ్గలో భారీ పేలుడు.. 8మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్ధాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు చాలా దూరం వరకు ఎగిరి పడ్డాయి.

పేలుడు ధాటికి పలు ఇళ్లలో కిటికీలు ధ్వంసమయ్యాయి. రోడ్లు బీటలు వచ్చాయి. దీంతో స్థానికులు భూ ప్రకంపనలు అనుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story