- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయోవృద్ధుల కోసం హగ్ బబుల్స్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19.. పిల్లలు, వయోవృద్ధుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి మారుతున్నా.. వీళ్ల విషయంలో అతిజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వయోవృద్ధులకు ఈ వయస్సులో కావాల్సింది తన వాళ్ల ప్రేమ, ఆప్యాయతలే. కానీ ఈ కొవిడ్ కారణంగా వారి దగ్గరికి వెళ్లాలన్నా కూడా కుటుంబ సభ్యులు సంకోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు వారికి గనక కొవిడ్ 19 వస్తే, ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోంది కాబట్టి ఇంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కేర్ సెంటర్లలో, వృద్ధాశ్రమాల్లో ఉన్న సీనియర్ సిటిజన్ల బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే.. వారిని చూడటానికి కుటుంబ సభ్యులు ఎప్పుడో ఒకసారి వస్తారు. అలా వచ్చినప్పుడు కూడా వారిని ప్రేమగా కౌగిలించుకుని ముట్టుకుని మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, అలాగే ప్రతి ఇబ్బందికి ఒక దారి ఉంటుంది. దీనికి కూడా ‘హగ్ బబుల్స్’ పరిష్కారాన్ని చూపించాయి.
హగ్ బబుల్స్.. పేరులోనే ఉంది కదా హగ్ అని. అంటే అప్యాయంగా కౌగిలించుకోవడానికి ఉపయోగపడే బబుల్స్. ఫ్రాన్స్‌లోని కేర్ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేశారు. రెండు వైపుల నుంచి వెళ్లగల ఒక పెద్ద తేలియాడే బబుల్ మధ్యలో సింథటిక్‌తో చేసిన కవర్ ఉంటుంది. ఒక వైపు నుంచి సీనియర్ సిటిజన్స్ మరోవైపు నుంచి వారి బంధువులు ఎంటర్ అవుతారు. రెండు చేతులు పెట్టుకోవడానికి వీలుగా కవర్‌కు రెండు రంధ్రాలు ఉంటాయి. వాటి గుండా చేతులను పెట్టి తమ వారిని కౌగిలించుకోవచ్చు. ఇలా ఒకరి వంతు పూర్తికాగానే ఆ బబుల్ మొత్తాన్ని శానిటైజ్ చేస్తారు. ఆ తర్వాత మరొకరు అందులో ప్రవేశించి తమ బంధువులను కలుస్తారు. ఈ హగ్ బబుల్స్ సాయంతో కుటుంబాన్ని కలుస్తున్న వాళ్లందరూ ఇష్టమైన వారి స్పర్శ తగలగానే ఆనందం తట్టుకోలేక కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఏదేమైనా ఈ కొవిడ్ 19 బంధాలకు కొత్త డెఫినిషన్ ఇచ్చింది.