గ్యాస్ పైన సబ్సిడీ రాలేదా.. ఇది మీకోసమే!

by Shyam |   ( Updated:2020-10-31 09:24:20.0  )
గ్యాస్ పైన సబ్సిడీ రాలేదా.. ఇది మీకోసమే!
X

దిశ, వెబ్‌డెస్క్: తమ కస్టమర్లకు ఇండేన్ గ్యాస్ కీలక సూచనలు చేసింది. ఎవరికైనా సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోతే అందుకోసం పరిష్కారం చూయించింది. ఇండేన్ గ్యాస్ అఫీషియల్ వెబ్‌సైట్‌‌లో తగు సూచనలు చేసింది. దీని ప్రకారం ఫాలో అయితే పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ డబ్బులు వెంటనే అకౌంట్‌లో జమ చేస్తామని స్పష్టం చేసింది.

సబ్సిడీ రావాలంటే మార్గాలు..

ఇండేన్ గ్యాస్ సబ్సీడీ కోసం https://cx.indianoil.in/ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స్టెప్ -1 ఇక మొదటి స్టెప్‌లో భాగంగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో రైట్ సైడ్ Contact Us అని ఒక అప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ -2లో Contact Us మీద క్లిక్ చేయగానే LPG అన్న పేరుతో గ్యాస్ సిలిండర్ సింబల్ కనబడుతోంది.
స్టెప్ -3లో దాని మీద క్లిక్ చేయగానే మీ సమస్య ఎంటని ఒక మేసేజ్ బాక్స్ వస్తుంది.
స్టెప్ -4లో భాగంగా మేసేజ్ బాక్స్‌లో Subsidy Related అని టైప్ చేసి దాని కిందనే లెఫ్ట్ సైడ్ లో ఉన్న Proceed పై క్లిక్ చేయాలి.
స్టెప్ -5లో భాగంగా మీకు మొత్తం 14 అప్షన్లు కనబడుతాయి. అందులో 7వ అప్షన్ అయిన Subsidy Related PAHAL ను ఎంచుకోవాలి.
స్టెప్ -6లో అదే పేజీలో సబ్ కేటగిరిలో భాగంగా రైట్ సైడ్‌లోనే మూడు అప్షన్లు ఉంటాయి. అందులో కూడా Subsidy not received అన్న ఫిర్యాదును ఎంచుకోవాలి.
స్టెప్ -7లో భాగంగా ఆ తర్వాతి పేజీలోనే ఎంటర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా LPG ID అడుగుతుంది.

సరైన వివరాలను ఇందులో మీరు పొందుపరిస్కే వెంటనే సబ్సిడీ లేని వారికి పెండింగ్‌లో ఉన్న మొత్త నగదును ఇండేన్ గ్యాస్ వారు ఖాతాలో జమచేయనున్నారు. వెబ్‌సైట్‌లో ఎదైనా అర్థం కాకుండా ఉన్నా.. సమస్య పరిష్కారం కాకపోతే ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్ నెంబర్ 1800-233-3555 కాల్ చేసి చెప్పవచ్చు. దీని ద్వారా కూడా కస్లమర్ల సబ్సిడీ కాకుండా మరే ఇతర సమస్యలను కూడా నివృత్తి చేయనున్నట్టు ఇండేన్ గ్యాస్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed