భర్త స్కెచ్.. భార్య కౌగిలిలో ప్రియుడు

by Anukaran |
భర్త స్కెచ్.. భార్య కౌగిలిలో ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇద్దరి క్షణికానందం వారి కుటుంబ సభ్యుల పరువును బజారుకు ఈడుస్తుంది. ఇంట్లో చక్కని భార్య, పిల్లలు ఉన్నా.. పరాయి స్త్రీల సుఖం కోసం పడిచస్తున్నారు. వివాహితలు సైతం భర్తల కన్నుగప్పి పర పురుషుడిని బెడ్ రూంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు మైకంలో ఉండి ప్రాణాలను తీసుకునే వరకు వెళ్తున్నారు. అప్పటి వరకు ‘అతడి’ సహచర్యం కోరుకున్న ‘ఆమె’.. భర్త, పిల్లలు గుర్తొచ్చి.. తన అక్రమ బంధాన్ని హత్యలతో ముగిస్తున్నారు. వెరసి ప్రియుడి కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుండడంతోపాటు ప్రియురాలు సైతం ఊచలు లెక్కించాల్సి వస్తుంది.

నవంబర్ 22, సోమవారం ఉదయం 6 గంటలు..

కోదాడ డివిజన్ అనంతగిరి మండల కేంద్రానికి శివారులోని పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహాం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన వారికి.. తలపై తీవ్రగాయాలై, రక్తస్రావం అయిన డెడ్ బాడీ కనిపించింది. పరిసరాలను పరిశీలించిన పోలీసులు అది హత్యగా అనుమానించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. అతడిని ఖమ్మం పట్టణానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెన్ని రంగనాథ్‌(43)గా గుర్తించారు.

ఆయన మా మామే..

హత్య స్థలానికి రాజేశ్వరి అనే మహిళ వచ్చింది. ఆమెను పోలీసులు విచారించగా.. ‘రంగనాథ్ తనకు వరసకు మామ అవుతాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఖమ్మం నుంచి బొలేరో వాహనంలో ఇద్దరం కలిసి శాంతినగర్‌కు వచ్చాం.
అనంతగిరి రహదారి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయం ఎదురుగా రోడ్డుపై వాహనం నిలిపి పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. అనంతరం బండపై కూర్చుని మాట్లాడుతుండగా చీకటిలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రంగనాథ్‌పై కర్రలతో దాడి చేశారు. తలపై మోది వరి పొలంలోకి తోసి పారిపోయారు. భయంతో నేను పరారీ అయ్యాను’అని వివరించింది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయట పడింది.

రంగనాథ్ హత్య ఎలా జరిగిందంటే..?

గ్రానెట్ వ్యాపారి రంగనాథ్‌కు, రాజేశ్వరికి కొన్నేళ్లుగా అక్రమ సంబంధం ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఇద్దరు కొద్దిరోజులుగా విడివిడిగా ఉంటున్నారు. ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో టైలరింగ్ చేస్తున్న రాజేశ్వరితో రంగనాథ్ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. నవంబర్ 21న రాజేశ్వరి భర్త ఆమె వద్దకు వచ్చి.. మనిద్దరి సంసారానికి రంగనాథ్ అడ్డువస్తున్నాడు. ఆయన వల్ల మనం, పిల్లలు విడిపోయాం. బంధువుల్లో చులకన అయ్యాం. అతడిని అడ్డుతొలగించుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాడు. ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఆ రోజు రాత్రి రంగానాథ్‌ను రాజేశ్వరి సూర్యాపేట జిల్లా కోదాడ సమీపానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడి గుట్టల్లో మాటు వేసి ఉన్న ఆమె భర్త.. ఇద్దరు గుట్ట వద్దకు వచ్చి కూర్చోగానే వెనక నుంచి కర్రతో రంగానాథ్ తలపై బలంగా కొట్టాడు. రంగానాథ్ భయంతో పరుగెడుతూ పొలంలో పడిపోయాడు. వెంటనే ఆయనపై బండరాయి ఎత్తేయడంతో అక్కడికక్కడే హతమయ్యాడు. రంగానాథ్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక భార్యాభర్తలు ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఉదయం తనకేం సంబంధం లేనట్టు వచ్చి ఘటనా స్థలంలో ఏడుస్తూ కూర్చుంది రాజేశ్వరి.

డిసెంబర్ 3, గురువారం రాత్రి 10 గంటలు..

అతడి పేరు షేక్ యూసుఫ్(28). శ్రీకాకుళం జిల్లా చెన్నముక్కపల్లి పంచాయతీ రాజులకాలనీ. డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తెల్లారితే కారు కిరాయికి వెళ్లాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం అతడికో ఫోన్ కాల్ వచ్చింది. ‘ఈరోజు రాత్రికి రా.. మా ఆయన ఇంట్లో ఉండడం లేదు. కలుద్దాం’అని. యూసుఫ్‌కు రాయచోటి పట్టణంలోని కొలిమిమిట్టకు చెందిన తన స్నేహితుడు మౌలాలి భార్యతో మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉన్నది. ప్రియురాలు పిలుపుతో రెక్కలు కట్టుకొని వెళ్లిన యూసుఫ్ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబీకులు మౌలాలి ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో యూసుఫ్ మృతదేహం లభించింది.

ఇంతకు హత్య చేసింది ఎవరు..?

మౌలాలి, యూసుఫ్ ఇద్దరూ డ్రైవర్లే. మంచి మిత్రులు కూడా. ఆ ఫ్రెండ్ షిప్ తో మౌలాలి ఇంటికి వచ్చిన యూసుఫ్… ఫ్రెండ్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది మూడేళ్లు కొనసాగింది. దీనిపై ఇరుకుటుంబాల్లో గొడవలు జరగడంతోపాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా కోపం తగ్గని మౌలాలి.. భార్య సాయంతోనే యూసుఫ్‌ను అంతం చేయాలని పన్నాగం పన్నాడు. దీనికి ఆమె కూడా ఒప్పుకోవడంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3న యూసుఫ్ కు ఫోన్ చేసిన మౌలాలి భార్య అతడిని నమ్మకంగా ఇంటికి రప్పించింది. ఇంట్లోకి వచ్చి ఆమె ఒడిలో వాలిన యూసుఫ్ పై ఇద్దరు కలిసి దాడి చేసి హత్య చేశారు.

ఈ రెండు ఘటనల్లోనూ ప్రియురాళ్లే నమ్మక ద్రోహం చేశారు. మొదట తన చెంతకు వచ్చిన వారిని తిరస్కరించకుండా సన్నిహితంగా మెలిగి.. చివరికి వారినే హత్య చేశారు. రెండు నిమిషాల సుఖం కోసం ఊర్లను దాటి వెళ్లి ప్రేయసి ఉచ్చులో చిక్కి ప్రాణాలను పొగొట్టుకున్నారు ఆ హతులు. ఏదేమైనా అక్రమ సంబంధం ఎప్పటికైనా ముప్పేనని సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed