- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పచ్చి చేపల్లోనూ కల్తీ.. ఇలా గుర్తించండి..?
దిశ, వెబ్‌డెస్క్ : చేపల్లో అత్యంత పోషక విలువలు ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండడం ప్రధాన కారణమైతే చేపలు తినడం వల్ల డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుందని మాంసాహారులు ఎక్కువగా చేపలను తినడానికి మొగ్గు చూపుతారు. పైగా చికెన్, మటన్ ధరలతో పోల్చుకుంటే చేపల ధర తక్కువగానే ఉంటుంది. అయితే నేటికాలంలో ప్రతి వస్తువు కల్తీ అవుతూనే ఉంది. ప్రస్తుతం చేపల తాజాదనంపై కూడ కల్తీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏది తాజా చేప, ఏది కాదు అనే వివరాలను తెలుసుకుందాం.
చేపల కొనుగోళ్లలో ప్రతి ఒక్కరూ చేప మొప్పలనే చూస్తారు. మొప్పలను ఎత్తి లోపలి భాగంలో గులాబీ రంగులో ఉందో లేదో చూసి కొనుగోలు చేస్తాం. వినియోగదారుల వీక్ నెస్ పాయంట్‌ను గుర్తించిన వ్యాపారులు మొప్పలకు రెడ్, గులాబీ కలర్‌ను స్ర్పే చేసి పాడైన చేపలను కూడా తాజా అని విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. అయితే చేపల కొనుగోళ్లలో కేవలం మొప్పలు మాత్రమే కాకుండా చేప తాజాదనం గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటిని గుర్తించడం ఎలాగో చూద్దాం.
తాజా చేపలు ఘాటైన నీసు వాసన వస్తాయి. సముద్రం చేప అయితే ఉప్పు నీటి వాసన, జలశాయాల్లోని చేపలకు కౌసు వాసన ఎక్కువగా వస్తుందట. ఆ వాసన రాకుండా ఉంటే అవ్వి పాడైపోయినట్లు గుర్తించాలట. ఐస్‌లో పెట్టిన చేపలు సైతం దుర్వాసన వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చేప కళ్లపై తెల్లటి పూత ఉన్నా, లోతుగా ఉన్నా తాజాదనం లేనిట్టేనని పేర్కొంటున్నారు. తాజా చేపల కళ్లు ఉబ్బినట్లు ఉండడంతోపాటు ప్రకాశవంతంగా ఉంటాయి.
తాజా చేపల ఆకృతి లోపల, బయట ఒకే ఆకృతిలో ఉంటాయి. గట్టిగానూ ఉంటాయి. చేప మెత్తగా ఉన్నా, చర్మంపై క్రస్ట్ ఉన్నా చాలా రోజుల నుంచి నిల్వ ఉన్నట్లు గమనించాలని చెబుతున్నారు. తాజా చేప కట్ చేసిన సమయంలో రక్తం ధారలుగా రావడంతోపాటు రంగు ఒకేలా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే పోషక విలువలు ఏమోగాని అనారోగ్యం పాలుకావడం ఖాయమని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.