- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోం మేడ్ మాస్క్ లను ఇలా క్లీన్ చేయండి
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ లు పెట్టుకోకపోతే.. జైలు శిక్ష , జరిమానా విధిస్తామని రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. దాంతో అందరూ మాస్క్ లను ధరిస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన మాస్క్ లు, కర్చీఫ్ లను మామూలుగా ఉతికితే సరిపోదు. బయటకు వెళ్లినప్పుడు ధరిస్తాం కాబట్టి వైరస్ దానిపై చేరే ప్రమాదం ఉండటంతో.. వీటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు విజయ్ రాఘవన్ సూచిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ లు పెట్టుకోవాలని సూచించడంతో పాటు.. ఇంట్లో తయారు చేసిన మాస్క్ లైన ధరించాలని ఆదేశాలిచ్చాయి. వన్ టైమ్ యూజ్ చేసే మాస్క్ లను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి వినియోగించవద్దని డాక్టర్లు చెబుతున్నారు.
– ఇంట్లో తయారు చేసిన మాస్క్ ను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. సబ్బు, వేడినీటితో వాటిని ఉతకాలి. ఉతికిన తర్వాత కనీసం 5 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి.
– ఒక వేళ ఎండలో ఆరపెట్టకపోతే.. నీటిలో ఉప్పు వేసి ప్రెజర్ కుక్కర్ లో కనీసం 15 నిముషాలు మాస్క్ ను ఉడికించాలి. ఆ తర్వాత ఆరబెట్టాలి.
– ఉతికిన తర్వాత మాస్క్ ను.. ఇస్త్రీ పెట్టెతో ఐదు నిముషాల పాటు మాస్క్ ను వేడిచేసిన పర్వాలేదు.
Tags: corona virus, home made mask, cleaning