- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంతమంది అన్నదమ్ములున్నా.. భార్య ఒక్కతే!
దిశ, వెబ్ డెస్క్: విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో కులానికో సంప్రదాయం, తెగకో ఆచారం ఉన్నది. పురాణాల కాలం నుంచి ఈ పద్ధతులు కొనసాగుతూ వస్తున్నాయి. మనిషి ఆది మానవుడి నుంచి కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టినా నేటికీ కొన్ని తెగ జాతుల్లో నాటి ఆచారాలే పాటిస్తున్నారు. హిమచల్ ప్రదేశ్ కు చెందిన ఓ తెగలో ఎంత మంది అన్నదమ్ములు ఉన్నా.. భార్య మాత్రం ఒక్కరే ఉండడం ఆ కుల ఆచారం. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసి కులాల్లో అన్న చనిపోతే వదినను పెళ్లాడే ఆచారం నేటికీ కొనసాగుతోంది.
ఒకే మహిళను ఐదుగురు అన్నదమ్ములు పెళ్లి చేసుకోని కాపురం చేశారని మనం మహాభారతం ద్వారా తెలుసుకున్నాం. అచ్చం అలాగే హిమాచల్ ప్రదేశ్ శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో ఇదే ఆచారం కొనసాగుతోంది. అక్కడి నిబంధనల ప్రకారం ఒకే యువతిని ఒక్కరికన్న ఎక్కువ మంది ఉన్న సోదరులు వివాహం చేసుకుంటారు. అనంతరం కుల పెద్దలు నిర్ణయించిన నిబంధనలను అనుసరిస్తు ఆమెతో అందరు సంసారం చేస్తారు. ఇలా వందల ఏళ్ల నుంచి ఇక్కడి ఆ ఆచారం పాటిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
అక్కడ ఆ ఆచారం అనాదిగా కొనసాగడానికి వ్యవసాయమే కారణమట. అక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. అయితే ఒక్కరు కన్న ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్న వారు వేర్వేరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే వ్యవసాయ భూమి అందరికి పంచి ఇవ్వాల్సి ఉంటుందని, దీని వల్ల ఘర్ణణ తలెత్తడంతోపాటు, కుటుంబ పోషణ కష్టమవుతుందని వారి భావన. అందుకే అందరూ కలిసి ఒక్కరినే వివాహమాడితే అంతా కలిసికట్టుగా ఉంటారని అనాధిగా ఆ వివాహ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. సంసారంలో గొడవలు రాకుండ అక్కడి కుల పెద్దలు పర్యవేక్షిస్తారట. ఏదిఏమైనా కొందరి సంస్కృతి, సంప్రదాయాలు మరికొందరికి ఆశ్చర్యంతోపాటు, వింతగానూ అనిపించకమానదు.