- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లి తొలి సెంచరీ వెనుక కిర్‌స్టన్ సలహా
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియాను మరో స్థాయిలో నిలబెట్టాడు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్. గ్రెగ్ చాపెల్ హయాంలో గందరగోళంగా మారిన టీమ్ఇండియాను చక్కదిద్ది టెస్టుల్లో నెంబర్ 1, వన్డే వరల్డ్ కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కిర్‌స్టన్ కోచ్‌గా ఉన్న సమయంలో సచిన్, సెహ్వాగ్ వంటి సీనియర్లకు తోడు కోహ్లి వంటి యువకులు కూడా ఉండేవాళ్లు. అలా అందరినీ సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు నడిపాడు. ఈరోజు కోహ్లి నెంబర్ వన్ క్రికెటర్‌గా తయారయ్యాడన్నా, 70 సెంచరీలు చేశాడన్నా దాని వెనుక కిర్‌స్టెన్ సలహా పని చేసింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లి ఆరంభంలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. బంతిని బాగానే మిడిల్ చేస్తున్నా గాల్లోకి లేపేయం ఓ బలహీనతగా మారింది. దీనిని గమనించిన గ్యారీ బంతిని గాల్లోకి లేపకూడదని కోహ్లికి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌లోనే విరాట్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ బాదాడు. ఎంతో ప్రతిభ దాగున్న క్రికెటర్ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో భారీ స్కోర్ చేయడం లేదని భావించే ఆ సలహా ఇచ్చినట్లు గ్యారీ తెలిపాడు.