- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కంపెనీకి కరోనా కలిసొచ్చింది!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రపంచానికి తెచ్చిన నష్టం చరిత్రలో ఎన్నడూ ఏ సంక్షోభం కూడా ఇవ్వలేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫార్మా వంటి అత్యవసరంగా పనిచేస్తున్నప్పటికీ ఎంతోకొంత నష్టం లేకపోలేదు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోను ఓ వ్యాపారి అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు.మిగిలిన రంగాలన్నీ నష్టాలను చూస్తోంటే.. వైద్య పరికరాలను అమ్మే వారికి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. అలాంటి వైద్య పరికరాలను ఆమే ఓ పెద్దాయన వ్యాపారం ఒక్కసారిగా ఆకాశానికి చేరింది. ఆయనెవరో తెలుసుకుందాం!
సింగపూర్‌కు చెందిన షెంజెన్ మైండ్‌రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ లీ జిటింగ్ కరోనా వైరస్ కారణంగా శ్రీమంతుడిగా మారిపోయాడు. లీ జిటింగ్ కంపెనీ వెంటిలేటర్లతో సహా పలు వైద్య పరికరాలను తయారు చేస్తుంది. కరోనా వల్ల వీటికి అత్యధిక డిమాండ్ ఉండటంతో తక్కువ సమయంలో అధిక లాభాలను దక్కించుకున్నాడు. వందకు పైగా దేశాల నుంచి ఆర్డర్లు రావడంతో భలే గిరాకీ సంపాదించాడు. ఒక్క ఇటలీ దేశానికే 10,000 వెంటిలేటర్లు షెంజెన్ మైండ్‌రే కంపెనీ నుంచి వెళ్లాయంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈయన షెంజెన్ మైండ్‌రే కంపెనీ సింగపూర్ మార్కెట్లో షేర్ ధర 50 శాతం పెరిగింది. ఈ అనూహ్య లాభంతో ఆ కంపెనీ నికర సంపద ఏకంగా రూ. 32,777 కోట్ల నుంచి రూ. 1,02,905 కోట్లకు ఎదిగింది. అదికూడా ఈ ఏడాది ప్రారంభం నుంచే. ఆయన ఈ ఏడాది రోజుకు రూ. 287 కోట్లను సంపాదించాడు. అంటే గంటకు రూ. 12 కోట్లు.
Tags: Singapore, Novel Coronavirus, covid-19, Li Xiting, Shenzhen Mindray Bio-Medical Electronics