బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం

by Shyam |
బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
X

బిర్యానీ తీసుకురా అని రోజూ అడుగుతున్నా భర్త తీసుకురావడం లేదని అలిగిన భార్య ఆత్మహత్యకు యత్నించిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… ప్రైవేటు ఉద్యోగి వెంకటయ్య కుటుంబంతో కలిసి రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. గత మూడు రోజులుగా అతని భార్య పద్మ (28) చికెన్‌ బిర్యానీ తీసుకురమ్మని భర్తను కోరుతోంది. ఎంత చెప్పినా తీసుకురావడంలేదని ఆవేదన చెందిన పద్మ.. ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపోరుగు గమనించి మంటలార్పి ‘108’ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను తరలించే సరికే దాదాపు 70 శాతం కాలిన గాయాలు కావడంతో..ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed