ఆరోగ్యశ్రీ పేరుతో నిలువు దోపిడి

by srinivas |
ఆరోగ్యశ్రీ పేరుతో నిలువు దోపిడి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయి. కరోనా సోకిన పేషెంట్లకి కరోనా ట్రీట్మెంట్ పేరుతో ఆరోగ్యశ్రీ ఖాతా నుంచి డబ్బులు గుంజుతున్నారు. కరోనా రోగి కోలుకున్న తర్వాత కూడా డిశ్చార్జ్ చేయకుండా నిలువు దోపిడి చేస్తున్నారు. కరోనా పూర్తి ప్యాకేజీ వసూలు చేసేందుకు 10 నుంచి 14 రోజుల పాటు రోగిని డిశ్చార్జ్ చేయయకుండా రోగులను ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. ఈ ఘటనల గురించి కొన్ని ఆసుపత్రుల పై ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదులు అందాయి. దీంతో రోగి కోలుకున్న వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story