Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 23-07-2024)

by Prasanna |   ( Updated:2024-07-22 23:30:43.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 23-07-2024)
X

మేష రాశి : మీ జీవిత భాగస్వామి కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోని అతిథి వల్ల మీ పనులన్ని ఆగిపోతాయి. ఈ రోజు సాయంత్రం మీ పిల్లలతో కలిసి బయటకు వెళ్తారు.

వృషభ రాశి: ఈ రోజు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తారు. మీ బంధువులతో గొడవల వల్ల అవమానంగా ఫీల్ అవుతారు. మిమల్ని బాధ పెట్టె స్నేహితులకు దూరంగా ఉండండి, మీ సంతోషం పెంచే వాళ్ళతో స్నేహం చేయండి. మీ ఖాళీ సమయములో మీకునచ్చినట్టుగా ఉండటానికి ఇష్ట పడతారు. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు.

మిథున రాశి: కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టె వారికి లాభాలు అధికమవుతాయి. మీకు నచ్చిన వారి కోసం కొత్తగా చేయాలనీ ప్రయత్నిస్తారు. దీని వలన వారు సంతోషంగా ఫీల్ అవుతారు. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాలా కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

సింహ రాశి : ఏదయినా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి. ఒకరు వల్ల మీరు ఒంటరిగా కూర్చొని బాధ పడతారు. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి లేదంటే మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే తరువాత ఇబ్బందుల్లో పడతారు.

కన్యా రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

తులా రాశి: ఈ రోజు.. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా నీరసంగా ఉంటారు. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోండి. అనుకోని బిల్లులు ఖర్చులను పెంచుతాయి. అయితే, దాని మీరు వల్ల ఆందోళన చెందుతారు. పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు ప్రేమను పంచకపోతే, మీ దగ్గరికి ప్రేమ రాదు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి హర్ట్ అవుతుంది.

ధనస్సు రాశి : మీ ప్రేయసితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఒక వేళ మీది తప్పు అయితే క్షమాపణలు అడగండి. మీ తప్పు ఏంటో తెలుసుకుని ఆమెను శాంతింపజేయాలి. ఈ రోజు మీరు చెడును ఎదుర్కొంటారు. దీని వలన మీరు చాలా డల్ అవుతారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎకువయ్యే అవకాశం ఉంది. కాబట్టి తినేటప్పుడు మంచి ఫుడ్స్ తీసుకోండి. మీ వ్యాపారం నుండి లాభాలను ఎలా సంపాదించాలో మీ పాత స్నేహితుడు మీకు సలహా ఇస్తారు. వారి సలహాను అనుసరించండి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు ఖాళీ సమయంలో టీవీ కానీ ఫోన్ ముందు గడుపుతారు. వివాహాలు స్వర్గంలో జరుగుతాయనే విషయాన్ని మీ జీవిత భాగస్వామికి ఈ రోజు మీరు రుజువు చేస్తారు.

మీన రాశి: ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వలన మీ ఇంట్లో వాళ్ళ మీద కోప పడతారు. ఇప్పటి వరకు దాచిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో బాగా నష్ట పోతారు. మీతో ఉండే వ్యక్తులు మీ దగ్గర డబ్బు తీసుకుని సమయానికి ఇవ్వకుండా ఉంటారు. దీని వలన మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Advertisement

Next Story