Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-07-06 18:45:49.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.చిన్న చిన్న పనులకోసం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వలన చిక్కుల్లో పడుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి : ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలల్లో పాల్గొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మిథున రాశి : నేడు ఈ రాశి వారు అధికంగా ఖర్చు చేస్తారు. ఇది మీ కుటుంబంలో కలహాలకు కారణం అవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతవారణం ఉండటంతో పాటు, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కర్కాటక రాశి : ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. నేడు ఈ రాశి వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రుణసదుపాయం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి : విద్యార్థులు నేడు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది. వివాహాది శుభకార్యాలకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశిలోని వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

కన్యా రాశి : నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీర్ఘకాలిక వ్యాధుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వస్తుంది. నేడు ఈ రాశి వారికి ఉన్నత పదువుల్లో అవకాశం లభిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

తుల రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశిలోని వారు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వీరి సమస్యలన్నీ తీరి నేడు చాలా సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. కానీ ఆఫీసులో మీ ప్రవర్తన కొంత మందికి నచ్చకపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటారు. మీకు తెలియకుండా మీరే ఇబ్బందులను సృష్టించుకొని, సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి ప్రవర్తన మీకు అంతగా నచ్చదు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి : నేడు ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రోజు మొత్తం ఆనందంగా సాగిపోతుంది.

మకరం రాశి : స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపోతాయి.

కుంభం రాశి : ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం రాశి : నేడు ఈ రాశి వారు విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. రుణ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి

Advertisement

Next Story

Most Viewed