- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope : ఈ రోజు రాశిఫలాలు
మేష రాశి : ఈరోజు మేషరాశి వారి ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. శుభకార్యాలు, వేడుకలు జరిపేందుకు ఈరోజు శుభదినం. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కాస్త జాగ్రత్తలు వహించడం మంచిది. మీ సహోద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం తలపెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మీ కుటుంబంలో చిన్నవారితో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
వృషభ రాశి : ఈ రోజున సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఇంటి పనులకు సంబంధించి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రేమించే వారికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి అనుకూలమైన రోజు. మీ పనిపైన, మీ ప్రాధాన్యత పైన శ్రద్ధ పెట్టండి.
మిథున రాశి : ఈ రాశి వారు ఈ రోజు తీసుకున్న అప్పులను చెల్లిస్తారు. భాగస్వామి తరపు బంధువులు రాక ఆటంకం కలిగిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని కాస్త గందరగోళంలో నెట్టేస్తుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈ రోజు ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోవాలి లేదా అతి సంతోషం సమస్యలకు దారితీయవచ్చు. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో కొట్లాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి : ఈ రోజు మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడంతో ఇంట్లో మరింత ప్రశాంతత కనిపిస్తుంది.
కన్య రాశి : ఈ రాశి వారు ఈ రోజున తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఏమి సాధించలేరు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొండి. అతిగా ఆడటం వలన మీ చదువు మీద ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో ఎక్కువ పట్టింపుగా ఉండవచ్చు.
తులా రాశి : ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందాన్ని కలిగిస్తుది. కమిషన్ల నుండి, డివిడెండ్లు లేదా రాయల్టీలు నుంచి లబ్దిని పొందుతారు. క్రొత్త ప్రాజెక్ట్ లు, ఖర్చులను వాయిదా వేయండి. మీరు మీ ఖాళీ సమయాన్ని మీ తల్లి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు కానీ సాధ్యం కాదు. వైవాహిక జీవితంలో మీరు సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.
వృశ్చిక రాశి : ఈరోజు మీ ఎనర్జీని మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఈరోజు మీ బంధువులలో ఎవరికైనా అప్పు ఇవ్వండి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు ఈ రోజున ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు డబ్బు విలువ తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
మకర రాశి : ఈ రాశివారు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎంచుకున్న పనులు మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పై విరుచుకుపడవచ్చు.
కుంభ రాశి : ఈ రోజు మీ ఖర్చులని తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది. గ్రహచలనం రీత్యా కొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇవాళ మంచిరోజు.
మీన రాశి : ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటినుండి బయటకు వెళ్లితే ధనాన్ని జాగ్రతగా భద్రపరుచుకోవాలి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండం మంచిది. మీ జీవితభాగస్వామి కుటుంబం నుంచి అశుభవార్తలు వింటారు.