Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-02-05 18:46:19.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి.

వృషభ రాశి : వాధ ప్రతివాదములకు దూరంగా ఉండవలెను. కొన్ని సంఘటనలు ఉద్రేకాలు లకు దారి తీయను. మిత్రులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక పరిణామాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగమునందు అధికారులతోటి మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.

మిథున రాశి : ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రాశి నిరుద్యోగులకు నేడు అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగవకాశాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి.ఈ రాశి వారు నేడు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి : ఈరాశి వారికి నేడు ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. చిన్న నాటి స్నేహితులను కలుసుకోవడం ద్వారా నేడు ఈ రాశికి చెందిన వారు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

సింహ రాశి : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు

కన్యారాశి : ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఉత్తమం. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ నేడు పెండింగ్ పడుతాయి. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు నేడు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులు అన్నిరంగాల్లో ముందంజలో ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వైద్యరంగంలో ఉన్నవారికి నేడు కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : ఈరోజు ప్రారంభంలోనే కొంత ఆర్థిక నష్టాన్ని చవిచూడొచ్చు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అమాయక పిల్లల ప్రవర్తన కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ ప్రియమైన వ్యక్తికి తగినంత సమయం ఇవ్వకపోతే, వారు కోపంగా ఉండొచ్చు.

ధనస్సు రాశి :నేడు ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు ఈజీగా జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎవరైతే లోన్ కోసం ట్రై చేస్తున్నారో వారికి లోన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి :ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు కాస్త ఇబ్బందలకు గురి అవుతారు. గతంలో మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉంటారో వారు మీకు నేడు తిరిగి ఇస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కుంభ రాశి : ఆర్థిక పరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులు సహోద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీన రాశి : విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులు నేడు చాలా సంతోషంగా గడుపుతారు.మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

Advertisement

Next Story