నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని లాభాలు

by samatah |   ( Updated:2023-03-21 01:55:05.0  )
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని లాభాలు
X

మేష రాశి : క్లిష్ట సమయాలను కూడా మీరు నేడు సంకల్పబలంతో ఎదుర్కోవడం ద్వారా ప్రశంసలు పొందుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం ఉత్తమమం. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఎదురు చూడని లాభాలు మీ సొంతం అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభ రాశి : ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు విలువ తెలిసి వస్తుంది. అందువలన డబ్బును ఎలా ఆదా చేయాలో తెలుసుకుంటారు. నిరుద్యోగులకు అందే ఓ శుభవార్త వారి ఇంటిల్లీ పాదిని ఆనందంలో ముచెత్తుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

మిథున రాశి : ఈరోజు ఈ రాశివారు స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఓ అందమైన గిఫ్ట్‌తో సర్ ప్రైజ్ చేస్తాడు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కర్కాటక రాశి : రోజంతా మీరు నవ్వులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. గతంలోని మొండి బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయట పడుతారు. ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఎవరైతే చాలాకాలంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి : ఈరోజు మీరు దగ్గరి బంధవుల ఇంటికి వెళ్లడం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీ తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. పెట్టుబడుల వలన అధిక లాభాలు పొందుతారు. చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించడం ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యమైన పనులు చేపట్టే ముందు జాగ్రత్త అవసరం.

కన్యా రాశి :ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.

తుల రాశి :తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.

వృశ్చిక రాశి : ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. మీరు కష్టపడి సంపాదించే డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలుసుకోండి. నేడు మీరు తెలివిగా చేసిన మదుపులే లాభాలు తీసుకొస్తాయి. ఈరోజు మీరు ఆఫీసులో వాదనలు, తగవులకు పూనుకోకుండా, ఇతరుల తప్పులెంచడం మానితే మంచిది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని సమస్యలు ఇబ్బందులు తీసుకొస్తాయి.

ధనస్సు రాశి : మీరు ఈరోజు మొత్తం ఆర్థిక సమస్యలు ఎదుర్కున్నప్పటికీ, చివర్లో లాభాలను పొందుతారు. ఈ రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి కలిసి వస్తుంది.

మకర రాశి :డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకొండి. మీయొక్క ఏకపక్ష నిర్ణయం తరువాత కొన్ని సమస్యలను తేవచ్చును. కుటుంబంలో మంచి ఫలితాలకోసం సామరస్యతను సాధించండీ. ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సో

కుంభ రాశి : ఈరోజు మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు చివర్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు నేడు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అవి లాభదాయకంగా ఉంటాయి. పనుల్లో జాగ్రత్త అవసరం.

మీన రాశి :అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

Also Read...

Telugu Panchangam 21 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story