- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఇవే! (15-07-2024)
మేష రాశి: ఈ రాశిలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలో ఉంటారు. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు డార్టర్ను సంప్రదించాలి. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు పెంచుకోవడానికి అద్భుతమైన సమయం ఇది. కాబట్టి ఆ పనిలో ఉండటం బెటర్. అయితే ఈ రాశి వారు నేడు తమ తెలివితేటలు ఉపయోగించి ఇంట్లో సమస్యలకు పరిష్కారం పొందాల్సి ఉంటుంది.
వృషభ రాశి: మీపై మీకున్న నమ్మకం హార్డ్ వర్క్‌తో మీ పైఅధికారులను మెప్పించి ప్రశంసలు అందుకుంటారు. నేడు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమై పోవడం వల్ల భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. అలాగే కొన్ని కారణాల వల్ల ఆఫీసులో టెన్షన్‌కు గురై దాని గురించి పదే పదే ఆలోచించి సమయాన్ని వేస్ట్ చేస్తారు. మీ భాగస్వామితో ఫుల్ ఎంజాయ్ చేసే రోజు ఇదే అవుతుంది. కానీ ఖర్చు విషయంలో ఆలోచించకుండా డబ్బు వృధా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి.
మిథున రాశి: మీ క్షణికావేశంలో, కోపం తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు కుటుంబ సభ్యులను బాధపెట్టే ప్రయత్నం చేయవద్దు. మీ కుటుంబ అవసరాలు తీర్చండి కానీ ఆందోళన చెందవద్దు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి: ఈ రోజు మీ గత కొద్ది కాలంగా ఎంత అడిగినా కానీ ఇవ్వని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఉమ్మడి వ్యాపారం చేయడానికి మిత్రులతో ఒప్పందాలు చేసుకోవడం అంత మంచిది కాదు. అలా చేసేటప్పుడు మీకు క్లోజ్‌గా ఉండేవారిని సలహా తీసుకోండి. కొంతమంది దూర ప్రయాణాలకు సిద్ధమవుతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ మీ భాగస్వామి నుంచి అందుకుంటారు.
సింహ రాశి: మీ ప్రవర్తనతో వైవాహిక జీవితంలో సమస్యలు కొని తెచ్చుకోకండి. లేకపోతే మీరు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు ధనాన్ని ఆస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. మీరు ప్రేమించే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన ఉంటే.. వారిని బయటకు తీసుకెళ్లి మీ ప్రేమను వ్యక్తం పరచడానికి మంచి రోజు అని చెప్పవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది.
కన్యా రాశి: తల్లి కాబోయే గర్భిణులు ఈ రోజున ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారు ఏదైనా కొనుగోలు చేయడానికి ముందు ఖర్చు పెట్టడాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నేడు అధ్బుతంగా సమయాన్ని గడపడానికి బంధువులు, మిత్రులు మిమ్మల్నిసంప్రదిస్తారు. ఉద్యోగులు ఆఫీసుకి తొందరగా వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్లడం వంటివి చేస్తారు. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
తులా రాశి: ప్రస్తుతం ఉన్న రోజుల్లో వ్యాయామం చేయడం పనిగా మారిపోయింది. అయితే ఈ రాశిలోని వారు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినడం మానేయాలి లేదంటే పలు సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యల వల్ల మీ తల్లిదండ్రులు చికాకుగా ఉంటే.. మీరు వారిని శాంత పరుస్తారు. మీ పనిపై శ్రద్ధ పెట్టి, ఆందోళన చెందకుండా స్పష్టత కలిగి ఉండండి. మీకు కావాల్సిన వారు మీకు తగిన సమయం ఇవ్వకపోతే వారితో మాట్లాడి మీ బాధ అర్థం అయ్యేలా చెప్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
వృశ్చిక రాశి: ఈ రాశిలోని వారు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా మద్యం తాగే అలవాటు కలిగి ఉన్నవారు మానుకోవడం బెటర్. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పటికీ బంధం బలపడుతుంది. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ కీర్తి ప్రతిష్టలు బాగా దెబ్బ తీసేలా ప్రవర్తించే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: మీకున్న కష్టాలను తలుచుకోవడం, పదే పదే వాటి గురించి ఆలోచించడం మానుకోవాలి. అలాగే కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రోజు మీకు ఆఫీస్ లో ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. సన్నిహితంగా ఉండే మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును. అలాగే కొన్ని కారణాల వల్ల టెన్షన్ పడతారు.
మకర రాశి: మతపరమయిన భావనలతో కొన్ని చోట్లకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా భక్తికి సంబంధించిన విషయాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి లేదంటే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆఫీస్ లో ప్రతి దానిపైనా ఈ రోజు మీదే పై చేయి కానుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు. అప్పట్లో మీరు అద్భుతమైన జ్ఞాపకాలు వారితో పంచుకుంటారు.
కుంభ రాశి: జీవితం పట్ల అవగాహన పెంచుకోవడం మంచిది. అలాగే లైఫ్‌లో జరిగే సంఘటనలకు నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. అలా జరగాలంటే వారికి మీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఈ అద్భుతమైన రోజు కోపతాపాలు అన్నీ మాయమైపోయి సంతోషంగా గడుపుతారు. ఆఫీసులో సమస్యలు పరిష్కరించాలనుకుంటారు కానీ టెన్షన్లో ఏమి చేయలేకపోతారు. ఈరోజు మీ ఇంటికి చుట్టాలు రావడం వల్ల సమయం వృధా అవుతుంది. అలాగే చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింత అందుకుంటారు.
మీన రాశి: డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీకు మిత్రులు ఈ రోజు మిమ్మల్ని ఓ గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తారు. ఈరోజు కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు మీ బాధలన్నీ వారితో పంచుకుంటారు. అలాగే జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకోవడం తో పాటుగా ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజు ఇది. ఎందుకంటే.. మీ భాగస్వామి మీరు ఏం అడిగినా చేస్తుంది. కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.