రాశిఫలాలు : రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు

by samatah |   ( Updated:2022-08-29 02:38:49.0  )
రాశిఫలాలు : రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు
X

మేష రాశి : మీ చిన్నతనం నాటి గుర్తులు మీ మనస్సుకు హాయి నిస్తాయి. ఈరోజు మీకు ఆర్థికంగా బాగుంటుంది. కొత్త ఆలోచనలతో, గతంలో పెండింగ్‌లో ఉన్న పని ఈజీగా పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. అనుకున్న పని ఈజీగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి : ఆరోగ్యంగా బాగుంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువులతో భేదాభిప్రాయాలు దూరమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రతీర్థయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

మిథున రాశి : ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అధిక ఖర్చులు చేయకండి లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు అదృష్టం మాములుగా ఉండదు. విదేశాల నుంచి ఆహ్వానం అందుకోగలరు. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి : మీ మాటలతో అందరినీ మాయ చేయగలరు. ఈ రోజు రెండో భాగంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు . రుణ బాధలు తీరిపోతాయి. భూ వ్యవహారాల్లో ఏమరుపాటు తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పై చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి.

సింహ రాశి : ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ స్నేహితులతో ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కన్యారాశి : ఈరోజు మీరు మీ సంతానం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఏదైనా పని చేసే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అస్సలు మర్చిపోకండి.

తుల రాశి : మీకు ఎక్జైటింగ్ గా చేసి, రిలాక్స్ అయేలాగ చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవండి. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. మీకు ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఆరోగ్య పరంగ జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే మీ అనారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వస్తోంది. స్థిరాస్తి మూలంగా ఆదాయం రావడం మొదలవుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృ. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

ధనస్సు రాశి : రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవురియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు. ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు శ్రమ అధికం అవుతుంది. సీనియర్ల నుంచి ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. కుటుంబంలో శుభాకార్యాలు జరిగే అవకాశం ఉంది. అందువలన ఖర్చులు పెరిగిపోతాయి.

మకర రాశి : ఇంట్లో వారి ఆరోగ్యం పాడవడం ఆందోళన కలిగిస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. డబ్బును అతిగా ఖర్చు చేయకండి, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు సంభ వించే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి : ఈ రాశివారు ఈరోజు చాలా సరదాగా గడుపుతారు. మీ దగ్గరికి బిజెనెస్ అప్పుకోసం వచ్చిన వారిని చూసి చూడనట్లుగా వదిలెయ్యండి. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈరోజు మీరు చాలా మూడీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు మిమ్ముల్ని ఆనందానికి గురిచేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం

మీన రాశి : అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో, వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దూరప్రయాణాలు చేస్తారు.

Also Read : మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే ?

Advertisement

Next Story

Most Viewed