- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (11-8-2024)
మేష రాశి: మీకున్న తెలివి, మేధాశక్తితో ఎలాంటి కొత్త విషయాలైనా తొందరగా నేర్చుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడి, పొదుపు విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి సలహాలు, సూచనలు పాటించినట్లు అయితే ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మీరు బహుమతులతో వస్తారని ఎదురు చూస్తుంది. వారి ప్రేమను మీరు పొందడంతో పాటుగా కౌగిలింతలు పొందుతారు. అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ చిన్న చిన్న ఇంటి తాలుకు టెన్షన్లను తెచ్చిపెడుతుంది.
వృషభ రాశి: మానసిక ప్రశాంతత పొందడం కోసం చిన్న చిన్న టెన్షన్స్‌ను వదిలించుకోవడం మంచిది. కాబట్టి అన్ని మర్చిపోయి దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసివస్తుంది. మీరున్నచోటికి అనుకోని అతిథులు వచ్చి సాయం చేస్తారు. మీరు ఈరోజు మంచి నవలను, లేదా మ్యాగజైన్ చదువుతూ కాలం గడుపుతారు. మీ భాగస్వామి పాత విషయాలు గుర్తు తెచ్చి మరీ వాదన పెడుతుంది.
మిథున రాశి: ఎవరైనా కొత్త వారిని కలిసినప్పుడు మీ భయాన్ని వదిలేసి ధైర్యంగా వారితో మాట్లాడండి. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి ధనాన్ని దాచిపెడితే విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉంటారు. అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోయినా కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి ప్రేమలోంచి బయటకు రారు.
కర్కాటక రాశి: మీ చెడు అలవాట్ల వల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉండేందుకు సరైన సమయం. మీ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ చేయొచ్చు.
సింహ రాశి: ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా మారుతాయి. ఇవి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఎందులో అయినా పెట్టుబడి పెట్టినట్లు అయితే ఆర్థిక నష్టాలు పొందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు సినిమాకు వెళ్లి మీ జీవిత భాగస్వామితో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇష్టమైన అలవాట్లను పూర్తి చేస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
కన్యా రాశి: ఇతరులతో మీ సంతోషకరమైన విషయాలు పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ రోజు, ధనం సంపాదించగలుగుతారు. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్ కి వెళతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు. కానీ వేరే అర్జెంట్ పని పడటం వల్ల వారు మీతో గడపకపోవడంతో డిస్టర్బ్ అవుతారు.
తులా రాశి: ఖాళీగా కూర్చునే మీ అలవాటు పలు ఆలోచనల వల్ల మీ మానసిక ప్రశాంతను దూరం చేయవచ్చు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెట్టి.. విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకుంటారు. మీకు హాని చేయాలని ప్రయత్నారు. అలా అని మీరు సైలెంట్‌గా ఉండకుండా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తే గొడవకు దారితీయవచ్చు. ఒకవేళ మీరు చెల్లుకు చెల్లు అని ఏదైనా చేయాలనుకుంటే.. అది వారికి తెలియకుండా చేయాలి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడప లేనంతగా బిజీగా మారవచ్చు.
వృశ్చిక రాశి: చాలా రోజులుగా డబ్బు కోసం ప్రయత్నిస్తున్న మీకు నేడు బాగా కలిసి వస్తుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కాబట్టి ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దాని గురించి వివరించాలి. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలనూ మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. అలాగే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకుంటారు.
ధనుస్సు రాశి: స్నేహితులతో పార్టీ కొరకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణం కొంతమందికి ఒత్తిడి కలిగిస్తుంది. ఈ రోజు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మకర రాశి: రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును పొదుపు చేయాలనే ఆలోచనలో ఉంటారు. మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడానికి తగిన సమయం ఇదే. వారు మిమ్మల్ని ఏమనకుండా.. మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటారు.పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది. ఎక్కువ సమయం మీరు కుటుంబముతో గడుపుతారు.
కుంభ రాశి: పని ఒత్తిడి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితం మారడానికి మీ భాగస్వామి సహాయం చేస్తారు. ఈరోజు ఏదైనా పని ప్రారంభించే ముందు,ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించాలి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. ఈరోజు, మీరు కారణమేంటో తెలియకుండా ఈ రోజంతా బాధపడతారు.
మీన రాశి: ఆరోగ్య సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారి భావాలకు గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా మీ క్షణికావేశంతో కించపరచకూడదు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని నమ్మండి కానీ అనుమానించకండి. ఈరోజు ఖాళీ సమయంలో కొత్త పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ సాధారణ జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ డేగా మారనుంది. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.