- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 19 నుంచి ఆ రాశుల వారు లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!
దిశ, ఫీచర్స్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ మే నెల గ్రహ సంచారానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా శక్తివంతమైన గ్రహాలు ఈ నెలలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మే 19న వృషభరాశిలో శుక్రుడు ప్రవేశించనున్నాడు. శృంగారం, కామం, అందం, ప్రతిభ, ఫ్యాషన్, లగ్జరీ, కీర్తి యొక్క స్వరూపులుగా పరిగణించబడే ఈ గ్రహం యొక్క ఈ రాశుల వారికి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఎక్కువ లాభాలు పొందే రాశులు ఇవే.. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
మేషరాశికి శుక్రుని సంచారం అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో వారు కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి. మీరు మీ సోదరుల నుండి మంచి మద్దతు పొందుతారు. ఎప్పటినుంచో ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
మిథున రాశి
మిథునరాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది. ముఖ్యంగా వృషభరాశిలో శుక్రుని సంచారం వలన ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యంగా పని చేసే వారికి ఈ సమయం శుభంగా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కూడా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.