- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zodiac signs : ఆగస్టు 16 నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన రాశులు ఇవే!
దిశ, ఫీచర్స్ : ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారికి చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. దీనికి కారణం, ఈ నెలలో శని, సూర్యుడు ఎదురు ఎదురుగా వస్తున్నారు. దీంతో సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా,ఆగస్టు 16 నుంచి మూడు రాశుల వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. కాగా, ఆ రాశులు ఏవి అంటే?
మేష రాశి : ఈ రాశి వారు ఆగస్టు 16 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పని చేసినా తగిన ఫలితం రాదు. కార్యాలయాల్లో సహా ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపే క్రమంలో జాగ్రత్త అవసరం. శత్రువులు పెరిగిపోతారు. వారు చిన్ని సమయం దొరికినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటారు. అప్పులు తీసుకోవడం, ఇవ్వడం రెండూ మీకు ఈ నెలలో మంచిది కాదు.
మకర రాశి : సూర్యుడు శని ఎదురు ఎదురుగా రావడం వలన మకర రాశి వారికి అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు విపరీతం గా పెరిగిపోతాయి. కోర్టు కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోక తప్పదు. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట జాగ్రత్త అవసరం.
మీన రాశి : సూర్యుడు, శని ఎదురు ఎదురుగా రావడం వలన ఏర్పడే సంసప్తక యోగం వలన మీన రాశి వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరిగే అవకాశం ఉంది. శత్రువులు మీపై అధిపత్యం చెలాయిస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు. వ్యాపారస్తులు నష్టాల్లో కూరుకుపోతారు. ఇంట్లో కుటుంబ సమస్యలు అధికం అవుతాయి. ( నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)