- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samsaptak Raj Yoga : 'సంసప్తక రాజ్యయోగం' ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు.. మీ రాశి ఉందా?

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. జనవరి 14వ తేదీన మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. నెల రోజులపాటు అదే రాశిలో సంచారం చేయనుంది. ఇప్పటికే ఈ రాశిలో కుజుడు ప్రవేశించి ఉన్నాడు. అయితే ఈ రెండు గ్రహాలు ఒకేసారి ఎదురుపడినప్పుడు 'సంసప్తక రాజ్యయోగం' ఏర్పడుతుంది. దీనివల్ల రెండు రాశుల వారికీ మంచి రోజులు మొదలు కానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కన్యా రాశి
'సంసప్తక రాజ్యయోగం' ఏర్పడడం వల్ల అద్భుతమైన విజయకాలం మొదలైందని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టిన పూర్తి చేస్తారు. ముఖ్యంగా, ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా వ్యాపారాలు పెట్టిన వారికీ ఇది మంచి సమయం. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు.
ధనస్సు రాశి
'సంసప్తక రాజ్యయోగం' ఏర్పడడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా, ఉద్యోగాలు చేసే వారికీ ఇది మంచి సమయం. కుటుంబ జీవితం గడిపే వారికి మంచి రోజులు వస్తాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారికి ఈ ఏడాది అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.