- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Malavya yoga: మాలవ్య రాజయోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు!

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చుకుంటాయి. గ్రహాలన్నింటిలో శుక్ర గ్రహాన్ని శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ రెండు కలయిక కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ధనుస్సు రాశి
శుక్ర గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికీ అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వారు కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసే వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
శుక్ర గ్రహ సంచారం కారణంగా వృషభ రాశి వారికీ అనేక లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఈ సమయంలో మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ పాత భూములకు రేట్లు పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.