- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jupiter : బృహస్పతి గ్రహ తిరోగమనం.. ఆ రాశులవారికి డబ్బే డబ్బు
దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాలన్నింటిలో బృహస్పతిని ముఖ్యమైనదిగా భావిస్తారు. దీని వలన సమాజంలో గౌరవం, అదృష్టం, కీర్తి లభిస్తుంది. ఇది ఎవరి జాతకంలో అయితే మంచిగా ఉంటుందో వారికి డబ్బుకి కొదువ ఉండదు. ఇది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 12 ఏళ్ళ పాటు సమయం పడుతుంది. ఇప్పుడు ఇది తిరోగమనం చేయబోతుంది. దీని ప్రభావం రెండు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృశ్చిక రాశి
బృహస్పతి తిరోగమనంతో ఈ రాశి వారు ఆర్ధికంగా లాభపడనున్నారు. అలాగే వీరు కెరీర్ లో కూడా అనుకున్న వాటిని సాధిస్తారు. కొత్తగా ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త కార్ లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి
బృహస్పతి తిరోగమనంతో కర్కాటక రాశివారు అధిక లాభాలు పొందుతారు. కోర్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలం. అలాగే, మీరు అనుకున్నవన్ని సాధిస్తారు. చిరు వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.