- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే చివరి వారంలో ఊహించని విధంగా ఉండబోతున్న రాశులు ఏవి అంటే?
దిశ, ఫీచర్స్ : గ్రహాల రాకుమారుడు బుధుడు. అయితే ఈయన మే నెలలో రెండు సార్లు తన రాశిని మార్చుకుంటున్నాడు. మే 31న ఈయన మరోసారి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ఉండబోతుందంట. వారు తమ జీవితంలో మంచి విజయాలు సాధించనున్నారంట. అంతే కాకుండా, స్టాక్ మార్కెట్, వ్యాపారాలలో పనిచేస్తున్న వారికి బుధ గ్రహ ప్రభావం అద్భుతంగా ఉంటుందంట. కాగా, ఏ రాశి వారికి బాగుండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి బుధుడి సంచారం చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బుధుడు మేషరాశిని వీడి వృషభంలోకి ప్రవేశించడం వలన వ్యాపార్లలో మంచి నిర్ణయాలు, కొత్త వ్యాపార ప్రయత్నాలు, ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుందంట. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టే వారికి కూడా బాగుండనుంది అంటున్నారు.
కర్కాటక రాశి : బుధుడి సంచారాం కర్కాటక రాశివారికి చాలా లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. అన్నిరంగాల్లో వీరు దూసుకపోయేలా చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యాపార వేత్తలు విదేశీ ఒప్పందాల నుంచి భారీ లాభాలు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి : సింహ రాశి వారికి బుధుడి సంచారం ఆర్థికంగా మేలు చేస్తుంది. ఈ సంచారం కర్మ, తొమ్మిదో ఇంట్లో జరుగుతుంది. డబ్బు సంపాదించడంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులు తమ రంగాల్లో విజయవంతం అవుతారు. జీవితంలో గొప్ప విజయాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో అనేక లాభాలు గడిస్తారు.