ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు.. జాగ్రత్తగా ఉండకపోతే తిప్పలు తప్పవు!

by Jakkula Samataha |
ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు.. జాగ్రత్తగా ఉండకపోతే తిప్పలు తప్పవు!
X

దిశ, ఫీచర్స్ : ఈ నెలలో కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవీ అనుకుంటున్నారా? ఈనెల జూలై 16 నుంచి షడకష్టక యోగం ఏర్పడబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అస్సలే బాగాలేదు అంటున్నారు పండితులు. ఎందుకంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి వచచినప్పుడు శని ప్రభావం ఏర్పడుతుంది. దీని వలన కొన్నిరాశుల వారికి ఇబ్బందులు తప్పవు. అవి ఏవి అంటే?

వృషభ రాశి : షడకష్టక యోగం అనేది జ్యోతిశ్య శాస్త్రంలోనే చాలా అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. ఆ యోగం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోవడం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఏర్పడుతాయి.

తుల రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా బాగున్నప్పటికీ ఈ యోగం వలన పలు సమస్యలు ఏర్పడుతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికం అయ్యే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు పండితులు.

కుంభ రాశి : కుంభరాశి వారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అంటున్నారు పండితులు.

కన్యారాశి : ఈ రాశి వారికి అంతా బాగున్నప్పటి, సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వలన పలు సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా పర్వాలేదు.

Advertisement

Next Story