Horoscope: కన్యరాశిలో రెండు గ్రహాలు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు

by Prasanna |
Horoscope: కన్యరాశిలో రెండు గ్రహాలు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కేతువు, శుక్ర గ్రహాలు ముఖ్యమైన గ్రహాలుగా చెబుతుంటారు. అలాగే కేతువు గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఇది దాని స్థానాన్ని అరుదుగా మారుస్తుంది. ఈ గ్రహ సంచారం చెడు ప్రభావం చూపుతుంది. అలాగే, శుక్రుడిని ఐశ్వర్యం, డబ్బు కి సూచికగా జ్యోతిష్యులు చెబుతారు. ఈ గ్రహం త్వరలోనే కన్యారాశిలోకి ప్రవేశించనుంది. ఇలా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. దీని ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్రుడు, కన్యా రాశిలోకి సంచారం చేయడం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, ఈ రాశి వారు ఆర్ధిక సంబందించిన విషయాల్లో లాభాలు పొందుతారు. అలాగే, పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా చూస్తే ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగం చేసే వారికీ జీతం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. అలాగే, ఈ సమయంలో కారు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. టెన్షన్స్ నుంచి విముక్తి లభిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed