Bhadra Raja Yoga: వచ్చే నెలలో భద్ర రాజయోగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

by Prasanna |   ( Updated:2024-08-18 12:59:02.0  )
Bhadra Raja Yoga: వచ్చే నెలలో భద్ర రాజయోగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
X

దిశ, ఫీచర్స్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. బుధ గ్రహ సంచారం చాలా ప్రత్యేకంగా చెబుతుంటారు. అన్ని గ్రహాల్లో ఈ గ్రహ సంచారం శుభంగా పరిగణిస్తారు. బుధ గ్రహం తిరోగమనం చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపైన ఉండనుంది. కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి చెడుగా ఉందని జ్యోతిష్యులు వెల్లడించారు. బుధుడు ప్రయాణిస్తూ కన్యా రాశి లోకి ప్రవేశించనున్నాడు. అయితే, ఒకేసారి రెండు రాశుల్లోకి బుధుడు సంచారం చేయడం వలన 'భద్ర రాజయోగం' ఏర్పడనుంది. ఈ కారణంగా రెండు రాశులవారి జీవితం మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడచూద్దాం..

కన్య రాశి

భద్ర రాజయోగం వలన కన్యా రాశి వారికి జీవితం పూర్తిగా మారిపోతుంది. అంతేకాకుండా, ఈ సమయంలో వారి గౌరవం కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. అలాగే సింగిల్స్‌ కి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అలాగే, ఈ సమయం ఎంతో బాగుంటుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి భద్ర రాజయోగం ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మీరు కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు మీ ఇంట్లో వారికీ చెప్పి చేయండి. దీని వలన ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. అలాగే, ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed