నెల రోజుల పాటు ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా?

by Prasanna |
నెల రోజుల పాటు ఈ  రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా?
X

దిశ, ఫీచర్స్: నవగ్రహాల్లో కుజుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రహం యొక్క ఆశీర్వాదం వలన మనకు శారీరక బలాన్ని ఇస్తుంది. కుజుడు బలంగా ఉంటే, మీరు పోలీసు, సైన్యం, రాజకీయాలలో గొప్ప నైపుణ్యాలను కలిగి ఉంటారు. జూన్ 1 న తేదీన కుజుడు, మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే రాశిలో 30 రోజులు ఉండనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశుల వారిపైన పడనుంది.. వారిలో ఈ రాశుల వారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి

కుజుడు మేషరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు వారికి అధిక లాభాలను వస్తాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ కెరీర్‌ కూడా మంచిగా ఉంటుంది. మీకు కుటుంబంలో గౌరవం పెరుగుతోంది. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అంగారక గ్రహ సంచారం అత్యంత అనుకూలమైనది. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబ్బు మీకు అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆఫీసులో పనిచేసే వారికి నుండి జీతం పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేందుకు ఇది అనువైన సమయం. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story