అక్కడ లాక్‌డౌన్ లేకుండానే కరోనాకు కట్టడి

by vinod kumar |
అక్కడ లాక్‌డౌన్ లేకుండానే కరోనాకు కట్టడి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుట్టిన చైనాలో ఆ వైరస్ అతలాకుతలం సృష్టించింది. చైనాకు సుదూరంగా ఉన్న అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లు భారీగానే నష్టపోయాయి. కానీ, చైనాను ఆనుకొని ఉన్న హాంకాంగ్ మాత్రం కరోనా బారి నుంచి త్వరగానే తప్పించుకుంది. చైనాకు పొరుగున ఉన్న ఈ దేశంలో సోమవారం ఒక్క కొవిడ్-19 కేసు నమోదు కాకపోవడం విశేషం. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 23న తొలి కేసు నమోదు కాగానే హాంకాంగ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా, అమెరికా సహా విదేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది.

సార్స్ వైరస్ అనుభవాలే..

లాక్‌డౌన్ విధించకుండానే ప్రజలను భౌతిక దూరం పాటించే విషయంలో కఠినంగా వ్యవహరించింది. ప్రభుత్వ నిబంధనలు అక్కడి ప్రజలు ఖచ్చితంగా పాటించి కరోనాను కట్టడి చేయగలిగారు. అత్యధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్ ఇంత త్వరగా కరోనాను కట్టడి చేయడానికి గతంలో సార్స్ వైరస్ అనుభవాలే ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు.

కరోనా ఫ్రీ దేశంగా.. హాంకాంగ్‌లో ఇప్పటి వరకు 1,026 మంది కొవిడ్ బారినపడగా వాళ్లలో 630 మంది కోలుకోగా నలుగురు మరణించారు. ఇంకా 392 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మరో రెండు వారాల్లో కొత్త కేసులు ఏవీ నమోదు కాకుంటే హాంకాంగ్ కరోనా ఫ్రీ దేశంగా మారుతుందని ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ లేకుండానే కరోనాను తరిమేసిన దేశంగా హాంకాంగ్ రికార్డు సృష్టించడానికి ప్రభుత్వం, ప్రజలే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబిచ్చింది.

Tags: Hong Kong, Corona, Sars Virus, Record, World Health Organization

Advertisement

Next Story