- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెక్స్ గురించి ఓపెన్‌గా డిస్కస్ చేయండి : ‘హనీ ట్రాప్’ డైరెక్టర్
దిశ, సినిమా : ‘సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ సినిమాల దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి.. ఇంటర్నేషనల్ ఇష్యూ బేస్ చేసుకుని ‘హనీ ట్రాప్’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ నెల 17న మూవీ రిలీజ్ కానుండగా.. ‘హనీ ట్రాప్’ మంచి మెసేజ్ ఉన్న సినిమా అని తెలిపారు. ఈ కాన్సెప్ట్‌పై నాలుగు సినిమాలు చేసే మెటీరియల్ ఉందని, హనీ ట్రాప్‌లో చిక్కుకుని యువతీయువకులు ఎలా మోసపోతున్నారో చూపించబోతున్నామని వివరించారు.
ఈ సినిమా యూత్‌కు తప్పకుండా నచ్చుతుందన్న ఆయన.. తన సినిమాలో కచ్చితంగా రొమాన్స్ ఉంటుందన్నారు. సెక్స్ గురించి ఓపెన్‌గా డిస్కస్ చేస్తేనే.. మైనర్ బాలికలు తమపై అటాక్ జరుగుతుందని చెప్పగలరని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని.. తల్లిదండ్రులు పిల్లలతో చర్చిస్తేనే వారి జీవితం బాగుంటుందన్నారు. కాగా భరద్వాజ్ సినీ క్రియేషన్స్‌పై వి.వి.వామనరావు నిర్మించిన సినిమాలో రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
- Tags
- honey trap