- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rammurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(Chandrababu) సోదరుడు రామ్మూర్తి నాయుడు(Rammurthy Naidu) కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital)లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ(TDP) తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్(Nara Rohith) తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.