భార్య గృహ హింస ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్

by Shyam |   ( Updated:2021-08-07 03:56:07.0  )
భార్య గృహ హింస ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్
X

దిశ, సినిమా : రాపర్ హనీ సింగ్ భార్య షాలిని తల్వార్ చేసిన గృహహింస ఆరోపణలపై తొలిసారిగా స్పందించాడు. 20 ఏళ్లు జీవిత భాగస్వామిగా ఉన్న షాలిని ఇలాంటి అసహ్యకరమైన ఆరోపణలు చేయడం బాధకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన లిరిక్స్‌పై కామెంట్స్, ఆరోగ్యంపై ఊహాగానాలు, నెగెటివ్ మీడియా కవరేజ్ ఇలా ఏ సందర్భంలోనూ స్పందించని తాను.. ఇప్పుడు మాత్రం సైలెన్స్ బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని వివరించాడు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తను దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, సంగీత దర్శకులతో పనిచేశానని.. తన భార్యతో ఎలా ఉంటానో వారికి తెలుసని చెప్పాడు. దశాబ్ధానికి పైగా తన సిబ్బందిలో భాగమైన షాలిని తల్వార్.. షూట్, ఈవెంట్స్, మీటింగ్స్‌కు తనతో పాటు వచ్చేదని తెలిపాడు. ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానన్న హనీ సింగ్.. ఈ విషయం న్యాయస్థానం ముందు ఉన్నందున ఇకపై మాట్లాడబోనని, దేశ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసముందని, త్వరలో నిజం బయటపడుతుందని నమ్ముతున్నానని చెప్పాడు.

Advertisement

Next Story