- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మశాన వాటికలో… హోమ్ క్వారంటైన్
దిశ ప్రతినిధి, మెదక్: ఇది దారుణమైన సంఘటన.. సభ్య సమాజం తలదించుకునే సంఘటన.. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు స్మశాన వాటికే హోం క్వారంటైన్ అయింది. చనిపోయిన శవాలను తగల బెట్టే స్మశాన వాటికను కరోనా బాధితులకు క్వారంటైన్ కేంద్రంగా మలిచిన సంఘటన… సంగారెడ్డి జిల్లా నారయణఖేడ్ నియోజకవర్గం కల్హేరు మండలం ఎమ్మెల్యే స్వంత గ్రామం ఖానాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా భాదితులను హోం క్వారంటైన్, ప్రభుత్వ ఆసుపత్రి హైసోలేషన సెంటర్లో ఉంచి చికిత్స అందించాలి. కానీ నారాయణఖేడ్‌లో ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ లేకపోవటంతో కరోనా పాజిటివ్ బాధితులను ఆ గ్రామ స్మశాన వాటికలో ఉంచి క్వారంటైన్ చేశారు. కరోనా బాధితులను గ్రామంలోకి అనుమతించకుండా ఉంచవలసిన ఉన్న స్మశాన వాటికను క్వారంటైన్‌గా మార్చి బాధితులను స్మశాన వాటికకు పరిమితం చేశారు. దీంతో కరోనా పాజిటివ్ బాధితులకు సరైన సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో మంచి చికిత్సతోపాటు, ఆరోగ్య కరమైన వాతావరణంలో మంచి పౌష్టికాఆహారం తీసుకోవాల్సిన కరోనా భాదితులు, చాలిచాలని సదుపాయాలతో ఇంకా ప్రారంభం కాని స్మశాన వాటికలో సరైన ఆహరం అందక బాధితులు కుమిలిపోతున్నరు. ఆసుపత్రిలో గానీ, హోం క్వారంటైన్‌లో ఉంచాల్సిన కరోనా పాజిటివ్ బాధితులను అధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ గ్రామ స్మశాన వాటిక అయిన వైకుంఠదామంలో తల దాచుకునేలా చేశారు.
స్మశాన వాటిక క్వారంటైన్‌లో ఉన్న ముగ్గురు బాధితులకు ఎవరైనా దయతలచి ఆహారం అందిస్తేనే తప్ప వారికి అక్కడ ప్రత్యేకంగా ఆహారం సదుపాయాలు లేవు. నారయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంత గ్రామంలో స్మశాన వాటికనే హోం క్వారంటైన్‌గా మలిచి కరోనా భాదితులను హీనంగా చూస్తున్నారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితులకు అందిస్తున్న స్మశాన వాటిక చికిత్సపై ప్రతిపక్షాలు, మేధావులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్మశాన వాటికలో ఒక మహిళ కరోనా బాధితురా సైతం ఉండటం గమనార్హం.