- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్.. నకిలీ నోట్లను తయారి చేస్తూ..
దిశ, వెబ్‌డెస్క్: కష్టపడి సంపాదించడం దండగ అనుకున్నారేమో.. ఏకంగా ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ను పెట్టి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారీ కేటుగాళ్లు. రూ.50 నుంచి రూ.500 నోట్ల వరకు ముద్రిస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందీ ముఠా. పోలీసుల కథనం ప్రకారం..
ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని బాలసాయి నగర్‌లోని ఓ ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. వెంటనే ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు 8 మంది ముఠాను గుర్తించారు. వారిలో ఇద్దరు పోలీసుల రాకను పసిగట్టి పరారీ అయ్యారు. ఆరుగులు వ్యక్తులు పట్టుబడ్డారు.
ఆ ఇంటి నుంచి నకిలీ నోట్లు తయారీకి వినియోగిస్తున్న ముద్రణ అచ్చులు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.80 వేలు నకిలీ కరెన్సీ సీజ్ చేశారు. ఐదు వందల, రెండు వందల, యాభై రూపాయలు నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రధాన నిందితుడు మధుసూదనరావు గతంలో ఒక సారి దొంగ నోట్లు తయారు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.