శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన హోంమంత్రి..

by Shyam |   ( Updated:2021-11-04 07:46:42.0  )
శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన హోంమంత్రి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను గురువారం హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ పరామర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఇటీవల మాతృవియోగం జరిగిన నేపథ్యంలో హోం శాఖ మంత్రి హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ మంత్రి మాతృమూర్తి శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలకొండ వద్ద ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పామ్ హౌస్ వద్ద శాంతమ్మ సమాధిపై పూల గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

అంతకుముందు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి రవీందర్ ముదిరాజ్, సిపిఎం నేతలు గోపాల్, రాములు, కురుమూర్తి, యాదవ సంఘం జిల్లా నేతలు గోపాల్ యాదవ్, శాంతన్న యాదవ్, శైలు యాదవ్, విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు, వీరశైవ లింగాయత్ అసోసియేషన్ గంగాధర్, రవీందర్, మహేష్, సంతోష్ కుమార్ తదితరులు శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Advertisement

Next Story